VZM: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి దివ్యాంగ శక్తి పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ఎస్.కోట డిపో ప్రబంధకుడు సుదర్శనరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం 40 శాతం, ఆపైన అంగవైకల్యం ఉన్నవారికి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ మెట్రో బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా కండక్టర్ వెనక ఒక సీటు కేటాయిస్తున్నట్లు చెప్పారు.