ASR: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నందున, వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే పనులు మొదలు పెట్టాలని జీకేవీధి ఏవో దాసరి గిరిబాబు రైతులకు సూచించారు. మంగళవారం ఏబులం, ధారకొండ, గింజంగి, పెదవలస గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. 90శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న బిందు సేద్యం పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు.