TG: రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హ్యామ్ రోడ్లకు 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారన్నారు. హ్యామ్ రోడ్ల ద్వారా కాంగ్రెస్కు వేల కోట్లు వస్తున్నాయని.. ఈ కమీషన్లను 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలన్నారు.