WNP: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈవీఎంల నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తెరిచి తనిఖీ నిర్వహించారు. నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.