E.G: CITU తూ.గో జిల్లా 12వ మహాసభలు ఏప్రిల్ 1,2 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం రాజమండ్రిలోని CITU జిల్లా కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందర్ బాబు, బీ.పవన్ మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్‌ను ప్రతిఘటించి కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేస్తామన్నారు.