గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది క్రమంగా వినికిడి శక్తిని తగ్గిస్తుంది. హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకోసారి ఇయర్‌ఫోన్స్ తీసేసి, చెవులకు గాలి తగిలేలా 5-10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ముఖ్యంగా ఇయర్‌ఫోన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.