వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం KMR కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులు ఆశా కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.