తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్లు ఎండిపోవడానికి కారణం ‘డైబ్యాక్’ తెగులేనని, ఇది కేవలం వైరస్ వల్ల వచ్చేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనివల్ల ఎలాంటి కీడు జరగదని, ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. వేపపువ్వును శుభ్రంగా కడిగి ఉగాది పచ్చడిలో వాడుకోవచ్చని వెల్లడించారు. ఒకవేళ వేపపువ్వు లభించని పక్షంలో ప్రత్యామ్నాయంగా తులసి ఆకులను వాడాలని పండితులు సూచిస్తున్నారు.