PLD: దుర్గి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మౌలిక సదుపాయాలు, వంటశాల, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు.