SRD: ఉపాధి హామీ 10 వారాల పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరారు.