ATP: సింగనమల(మం) సకలంచెరువులోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు, తదితర అంశాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.