PLD: పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని 330 పడకల నుంచి 420 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్గ్రేడేషన్ ద్వారా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్గా మరింత బలోపేతం కానుంది. 100 MBBS సీట్లకు అనుమతి పొందేందుకు మార్గం సుగమం అయినందున స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.