HYDలో పలు చోట్ల నీటి సరఫరా బంద్ కానుంది. JAN 8న ఉదయం 10 గంటల నుంచి JAN 9న తెల్లవారుజామున 4 గంటల వరకు సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్లైన్లో లీకేజీలకు మరమ్మత్తులు చేయనున్నారు. ఈ కారణంగా మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఫతేనగర్, బాలానగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో 18 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSSB తెలిపింది.