AP: ONGC బ్లోఅవుట్ 95శాతం అదుపులోకి వచ్చిందని కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని చెప్పారు. త్వరలోనే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని వెల్లడించారు. దెబ్బతిన్న పంటలకు, రైతులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.