NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఏఎస్ఐలు సంజీవయ్య, తిమ్మారెడ్డి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.