MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన రైతు పట్నం శ్రీశైలం (45) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లిన ఆయన అక్కడ ఉరేసుకుని మృతి చెందారని చెప్పారు. ఆర్థిక, కుటుంబ సమస్యలే కారణమని కుమారుడు వినయ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.