KMM: కల్లుగీత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఖమ్మం మంచి కంటి భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.