TG: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీతో ఏడాదిలో లక్ష వాహనాలు అమ్ముడయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈవీ వాహనాలకు మినహాయించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నామన్నారు.