పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో తుది ఓటరు జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వేణు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 2,58,059 మందితో ముసాయిదా జాబితా సిద్ధం చేశామని, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.