GDWL: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు తక్షణమే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణను కలిసి ఈ విషయంలో వినతిపత్రం సమర్పించారు. కేవలం సబ్ ప్లాన్ ద్వారా మాత్రమే వెనుకబడిన తరగతులకు సమర్థవంతమైన అభివృద్ధి అవకాశాలు కల్పించగలమని అన్నారు.