VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం సర్పంచ్ ఎం.వై.రామస్వామి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఆర్ధన్నపాలెంలో పైకప్పు రేకుల షెడ్ శిథిలస్థితికి ఉండడం, టాయిలెట్స్ నిర్మాణం చేయుటకు ఆమోదం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్ కాలపరిమితి ముగుస్తూన్నందున కలెక్టరుకు ప్రతిపాదనలు చేయుటకు తీర్మానం చేసినట్లు చెప్పారు.