SS: ఓబులదేవరచెరువులోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. HM జయసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లికలు వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.