PDPL: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని 13,14,32,33 వార్డుల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం 13వ వార్డు శ్రీరాంనగర్‌లోని సీతారామ ఆలయం వద్ద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 440 ఇళ్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.