E.G: ప్రజా వేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానిదని జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో శుక్రవారం ప్రజా వేదిక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌కు ఇర్రిపాక క్లస్టర్లో ఉన్న గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న వారి సమస్యలపై పలు వినతులు అందజేశారు.