ATP: రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ శుక్రవారం అనంతపురం జిల్లాకు వచ్చారు. నగరంలోని ఓ హోటల్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ వారిని కలిశారు. పూల మొక్కలు అందజేసి అధికారులకు స్వాగతం పలికారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనితీరు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.