KMM: వైరా సబ్స్టేషన్ పరిధిలోని టౌన్-1 ఫీడర్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల సాయిబాబా గుడి, సత్రం బజార్, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి, బాలాజీ నగర్, రేచర్ల బజార్ ప్రాంతాల్లో అంతరాయం కలగనుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.