NRML: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం కడెం ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకార సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రాజెక్టులు, చెరువుల్లో 100% రాయితీతో చేప పిల్లలు పంపిణీ చేస్తామన్నారు.