VZM: 18 ఏళ్లలోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో నేడు సమన్వయ సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.