W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కూటమి నాయకులు కృషి చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ నాయకుడు ఈతకోట తాతాజీ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల 45వ వార్షిక మహోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల ప్రధాన అధ్యాపకురాలు నాగవేణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.