ADB: గిరిజన సంక్షేమ హాస్టల్లు, గురుకులాల పాఠశాలలకు సరఫరా చేసే ఆహార పదార్ధాలు, సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ సూచించారు. వసతి గృహలకు అవసరమైన ఆహార పదార్ధాలు సరఫరా చేయటానికి కావాల్సిన గుత్తేదారులను ఖరారు చేయటానికి జీసీసీ డిఎం గుడిమళ్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ధరల నిర్ణయ కమిటీ సమావేశం నిర్వహించారు.