CTR: సంచలనం రేపిన వికలాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడు గణేష్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను పెళ్లి చేసుకుందామని నమ్మించి నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గణేష్ ఆమెను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలియజేశారు. కట్టమంచి జంక్షన్ వద్ద ఓ గదిలో ఉన్న అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు.