MDK: ఆపరేషన్ స్మైల్లో బాల కార్మికులను గుర్తించాలని తూప్రాన్ ఆర్డివో జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల కార్మికులను నిర్మూలించాల్సిన అవసరమం అందరిపై ఉందన్నారు. దాడులు నిర్వహించి 14 ఏళ్ల లోపు బాల కార్మికులను గుర్తించాలని ఆర్డీవో ఆదేశించారు.