నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఇవాళ సాయంత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎండోమెంట్ ఏసీ విజయ రామారావు ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. అర్చకులతో వేద ఆశీర్వచనం నిర్వహించి శేష వస్త్రంతో సన్మానించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు రవీందర్, వేణు, రాములు, పాల్గొన్నారు.