ATP: తాడిపత్రిలో ధనుర్మాసం సందర్భంగా 23వ రోజు ఇంటింటికీ తిరుప్పావై కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. చలమారెడ్డి, శివపార్వతిల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి తిరుప్పావై విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.