నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు నల్గొండ చేరుకుని సాయంత్రం 6:00 గంటల వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నం 3:00 నుంచి 5:00 గంటల వరకు కలెక్టరేట్లో సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష జరపనున్నారు.