HYD: TGSRTC హైదరాబాద్ నుంచి సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 9 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు 6500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం SCR రైల్వే కూడా 11 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.