AP: తెలుగువారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టిన మహానుభావుడు అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తెలుగు కోసం ఎన్టీఆర్ పోరాడారని, మన పిల్లలు తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. అమ్మ, నాన్న అనే పదాల్లో ఎంతో ప్రేమ, మాధుర్యం ఉందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాచీన కళలు ఉన్నాయని గుర్తుచేశారు.