NTR: కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలు మారడం లేదన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయని విమర్శించారు.