NTR: 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని జిల్లా డైట్ కళాశాల అధ్యాపకుడు మిరియాల బోసుబాబు సూచించారు. మంగళవారం ఎ.కొండూరు, చీమలపాడు, రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ను గురించి ఆరా తీశారు.