యాషెస్ చివరి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ జో రూట్ 160 పరుగుల భారీ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్ 91 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.