ప్రకాశం: బేస్తవారిపేటలో స్థానిక ఎంపీడీవో రంగనాయకులు ఆధ్వర్యంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. స్వచ్ఛత చర్యలను ప్రతి ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. మండలంలో ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.