TG: రాష్ట్రంలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం యూరియా 1,67,884 మెట్రిక్ టన్నులు, డీ.ఏ.పీ 51,458 మెట్రిక్ టన్నులు నిల్వల్లో ఉన్నాయన్నారు. రైతులకు ఎరువులు ఎక్కడా కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఫెర్టిలైజర్ యాప్ను ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు.