ATP: జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి తండ్రి, దివంగత నేత అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద నివాళులర్పించారు. సోమవారం అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని పెద్దారెడ్డి స్మరించుకున్నారు.