ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సోమవారం పరిశీలించారు. పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన పనులను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం సీమ హక్కులను తాకట్టు పెడుతోందని విమర్శించారు. కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును నిలిపివేయడం మరణశాసనమని మండిపడ్డారు.