TG: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలపై సమీక్ష చేపట్టి, పాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించనుందట. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశముందని సమాచారం. కొత్తగా మరో 5 జిల్లాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని టాక్.