GDWL: జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్ గౌడ్ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలను ఉపయోగించి సొంత పరిశ్రమలు స్థాపించమని పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డీ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్యను తగ్గించి ఉపాధి అవకాశాలను సృష్టించడం ముఖ్యమని తెలిపారు.