MDK: నర్సాపూర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, పనుల పురోగతిపై కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డితో ఆమె సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.