NGKL: పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేష్ కుమారుడు మిట్టు (3)ను తీసుకుని పొలానికి వెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రొటావేటర్ కిందపడి బుధవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారిన ఘటనపై తల్లిదండ్రులు కన్నీరుముంచుకుని విషాదంలో మునిగారు.