NRPT: మక్తల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న కోర్టు భవనాన్ని బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు పరిశీలించారు. భవనంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను చూశారు. మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 17న హై కోర్టు న్యాయమూర్తులు కోర్టును ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.