ADB: నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ ఆత్రం గంగారాం ఉప సర్పంచ్ లక్ష్మణ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుజాత, గణపతి, భుజంగ్, తదితరులు పాల్గొన్నారు.